Lifestyle

గుండె ఆరోగ్యం

గుమ్మడి కాయలో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ను తగ్గించి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: Getty

డయాబెటిస్ మెల్లిటస్

గుమ్మడికాయ మధుమేహులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే గుమ్మడికాయ, దీని విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
 

Image credits: Getty

ఇమ్యూనిటీ

ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. అయితే విటమిన్ సి పుష్కలంగా ఉండే గుమ్మడికాయ మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
 

Image credits: Getty

క్యాన్సర్ రిస్క్

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గుమ్మడికాయలను రెగ్యులర్ గా తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా ఇది క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. 
 

Image credits: Getty

జీర్ణం

గుమ్మడికాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీన్ని తింటే మలబద్దకం సమస్యే రాదు.
 

Image credits: Getty

బరువు తగ్గడానికి

గుమ్మడికాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే ఆకలి తగ్గుతుంది. కడుపు తొందరగా నిండుతుంది. ఇవి బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి.
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే గుమ్మడికాయను తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కాంతివంతంగా మెరిసిపోతుంది కూడా. 
 

Image credits: Getty

మెరుగైన నిద్ర

ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే గుమ్మడికాయ గింజలను తింటే బాగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty
Find Next One