Lifestyle

జుట్టు రాలడం

మన జుట్టు ఆరోగ్యంగా, షైనీగా, బలంగా, ఒత్తుగా ఉండటానికి జింక్ చాలా చాలా అవసరం. అయితే ఇది లోపిస్తే జుట్టు విపరీతంగా రాలుతుంది. 
 

Image credits: Getty

ఇమ్యూనిటీ

ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే మనం ఆరోగ్యంగా, ఎలాంటి రోగాలు లేకుండా ఉంటాం. అయితే మనలో జింక్ తగ్గితే మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో ఎన్నో రోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 

Image credits: Getty

చర్మ సమస్యలు

జింక్ లోపం వల్ల కూడా ఎన్నో చర్మ సమస్యలొస్తాయి. ముఖ్యంగా మొటిమలు, తామర వంటి ఎణ్నో చర్మ సంబంధిత సమస్యలు కూడా జింక్ తగ్గడం వల్ల వస్తాయంటున్నారు నిపుణులు. 
 

Image credits: Getty

గాయాలు నయం కాకపోవడం

గాయాలను నయం చేయడానికి జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇది మన శరీరంలో తగ్గితే గాయలు చాలా లేట్ గా నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

వాసన, రుచి తెలియకపోవడం

మనకు రుచి మరియు వాసనను అనుభూతి కలిగించడంలో జింక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి జింక్ తగ్గినప్పుడు రుచి, వాసన కూడా సమస్యగా మారుతుంది.

Image credits: Getty

జీర్ణ వ్యవస్థ

మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి జింక్ కూడా చాలా చాలా అవసరం. అందుకే మన శరీరంలో ఇది తగ్గినప్పుడు జీర్ణక్రియ కూడా మందగిస్తుంది.
 

Image credits: Getty

అలసట

జింక్ లోపం వల్ల మన శరీరంలోని ఎన్నో అంతర్గత కార్యకలాపాలు మందగిస్తాయి. దీంతో మనకు అలసటగా అనిపిస్తుంది. 

Image credits: Getty

కంటి సమస్యలు

జింక్ లోపం మన కళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. శరీరంలో జింక్ లోపిస్తే కంటి చూపు తగ్గుతుంది. కళ్లు మసకగా కనిపిస్తాయి.

Image credits: Getty
Find Next One