Lifestyle

గట్ ఆరోగ్యం

గట్ ఆరోగ్యండ్రాగన్ ఫ్రూట్ లో జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఈ పండును తింటే జీర్ణక్రియకు మంచిది. ఈ పండు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image credits: Getty

ఇమ్యూనిటీ

ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా మనకు ఎలాంటి అంటువ్యాధులు, ఇతర రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అయితే డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

డ్రాగన్ ఫ్రూట్ లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును రోజూ తింటే మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

డ్రాగన్ ఫ్రూట్స్ అధిక రక్తపోటును నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది. 
 

Image credits: Getty

డయాబెటిస్ మెల్లిటస్

డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఈ పండును రెగ్యులర్ గా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం తక్కువ.
 

Image credits: Getty

బరువు తగ్గడానికి

డ్రాగన్ ఫ్రూట్ కూడా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే ఈ పండును తింటే మీరు తక్కువగా తినే అవకాశం ఉంది. ఇది మీ ఆకలిని నియంత్రిస్తుంది.
 

Image credits: Getty

క్యాన్సర్ నివారణ

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండును రెగ్యులర్ గా తింటే చర్మం కాంతివంతంగా, తేమగా,ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: Getty

కిడ్నీ స్టోన్స్ రాకూడదంటే ఈ ఆహారాలను తినండి

మలబద్దకం తగ్గాలంటే పొద్దున్నే ఈ పండ్లను తినండి

ఒకే టైం కు ఎందుకు నిద్రపోవాలో తెలుసా?

బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లు ఈ పండ్లను తినకపోవడమే మంచిది