Lifestyle
ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మధ్య వయస్కులకే కాదు యువతకు కూడా ఈ అనారోగ్య సమస్య వస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
కాల్షియం, యూరిక్ ఆమ్లాన్ని కలిగి ఉన్న ఖనిజాల ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇవి విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి.
మన మూత్రపిండాల్లో ఖనిజాలు పేరుకుపోయినప్పుడు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. ఇలా జరగకూడదంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా మన రోజువారి ఆహారంలో కొన్ని రకాల ఆహారాలను చేర్చుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
అరటిపండ్లలో ఉండే పొటాషియం కాల్షియం, ఆక్సలేట్ స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.
సిట్రస్ పండ్లలో ఉండే సిట్రేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ పండ్లు మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి.
పాల ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటాన్ని తగ్గించొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.