Lifestyle
ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే ఖర్జూరం మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం రాత్రంతా నీటిలో నానబెట్టిన ఖర్జూరాలను ఉదయం పరగడుపున తినాలి.
వీటిలో కూడా ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే ఎండుద్రాక్ష జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్షను తినండి. సమస్య ఉండదు.
జీర్ణక్రియను మెరుగుపరచడానికి అరటిపండ్లు ఎంతో సహాయపడతాయి. మలబద్దకాన్ని నివారించడానికి, పొట్ట ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.
నారింజ పండ్లలో ప్రధానంగా విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మలబద్దకంతో పోరాడటానికి సహాయపడతాయి. జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.
బొప్పాయిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల మలబద్దకాం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
పాలకూరలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి కూడా సహాయపడతాయి.
ఫైబర్ అధికంగా ఉండే తీపి బంగాళాదుంపను మీ ఆహారంలో చేర్చడం వల్ల కూడా మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు.
కివీల్లో కూడా ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఉదయం తింటే మలబద్ధకం నుంచి ఉపశమనం పొందుతారు.