Lifestyle

వెయిట్ లాస్

కాలీఫ్లవర్‌లో క్యాలరీలే కాదు కార్బోహైడ్రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయ బరువు తగ్గాలనుకునేవారికి ఎంతగానో సహాయపడుతుంది. 
 

 

Image credits: Getty

క్యాన్సర్ రిస్క్

ఈ కూరగాయలో గ్లూకోసినోలేట్స్ , రోటినాయిడ్స్‌తో పాటుగా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.ఈ సమ్మేళనాలు కణాలను ఆక్సీకరణ ఒత్తిడిని, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

క్యాలీఫ్లవర్‌లో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
 

Image credits: Getty

రక్తపోటు

కాలీఫ్లవర్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే ఈ కూరగాయను హైబీపీ పేషెంట్లు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

Image credits: Getty

జీర్ణ ఆరోగ్యం

కాలీఫ్లవర్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. ఈ కూరగాయను తింటే మలబద్ధకం సమస్య ఉండదు. జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. 
 

 

Image credits: Getty

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు

కాలీఫ్లవర్ లో బయోయాక్టివ్ సమ్మేళనాలు, సల్ఫోరాఫేన్ వంటివి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా ఉంటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Image credits: Getty

కలబందతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

జలుబు, తుమ్ములతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..!

ఈ ఫుడ్ తింటే ఎన్ని రోగాల ముప్పు తప్పుతుందో..!

రాత్రిపూట వీటిని తాగితే బాగా నిద్రపడుతుంది