Lifestyle

బాదం పాలు

బాదం పాలు కూడా మీరు కంటినిండా నిద్రపోవడానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ రెండు ఆహారాలు మీకు మంచి పోషకాలను అందించడమే కాకుండా నిద్రలేమి సమస్యను పోగొట్టడానికి కూడా సహాయపడతాయి. 
 

Image credits: Getty

గ్రీన్ టీ

గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నిద్రపోవడానకి ముందు దీన్ని తాగితే మీకు రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది. 

Image credits: Getty

చామంతి టీ

చమోమిలే టీ లో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. నిద్రపోవడానికి ముందు చామంతి టీని తాగినా మీకు కంటినిండా నిద్రపడుతుంది. 
 

Image credits: Getty

చెర్రీ జ్యూస్

చెర్రీ జ్యూస్ రాత్రి నిద్ర కోసం తాగే మరొక పానీయం. చెర్రీస్ లోని మెలటోనిన్ దీనికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

Image credits: Getty

పసుపు పాలు

హల్దీ మిల్క్ లేదా పసుపు పాలు కూడా రాత్రిళ్లు బాగా నిద్రపట్టడానికి ఎంతో సహాయపడతాయి. ఈ పాలు మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడతాయి. 
 

Image credits: Getty

అశ్వగంధ టీ

అశ్వగంధ టీలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తాగడం వల్ల మీరు రాత్రిళ్లు ప్రశాతంగా నిద్రపోతారు. అలాగే ఎన్నో రోగాల ముప్పు కూడా తప్పుతుంది. 
 

Image credits: Getty

పుదీనా టీ

పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.  పుదీనా కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి నిద్రపోవడానికి ఎంతో సహాయపడుతుంది. 
 

Image credits: Getty
Find Next One