Lifestyle
తులసి ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. తులసిని ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. తులసి, నల్ల మిరియాలతో తయారు చేసిన కాఫీని తాగితే జలుబు తగ్గుతుంది.
ఉల్లిపాయలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జలుబును తగ్గించుకోవడానికి ఎండుమిర్చి రసం, తులసి ఆకుల రసం, తేనె కలిపి తీసుకోవాలి.
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ పదార్ధం. మీకు జలుబు చేసినప్పుడు మీ రోజువారి ఆహారంలో వెల్లుల్లిని చేర్చండి. ఇది ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.
అల్లం కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అల్లం, తులసి కలిపిన నీటిని తాగితే జలుబు, దగ్గు, తుమ్ములు తగ్గిపోతాయి. అలాగే మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
జలుబును తగ్గించుకోవడానికి రెండు నిమ్మకాయలను తీసుకుని రసాన్ని ఒక గ్లాసు కాచిన నీటిలో పోయండి. దీనిలో రుచికి తగ్గ పంచదారను కలిపి రాత్రి తిన్న తర్వాత తాగండి.
తేనెలో ఎన్నో రకాల యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసం, తేనె కలిపిన టీని తాగితే జలుబు, గొంతునొప్పి తొందరగా తగ్గుతాయి.
మిరియాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. జలుబును, దగ్గును తగ్గించుకోవడానికి వేడి పాలలో కొద్దిగా మిరియాల పొడిని వేసి తాగండి. ఈ పాలు కూడా మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి.
పసుపు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. పసుపు కలిపిన పాలను తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జలుబు, గొంతు నొప్పి తొందరగా తగ్గుతాయి.