Telugu

అరటిపండు

అరటిపండులో పొటాషియం మెండుగా ఉంటుంది. ఈ పండును తింటే తక్షణ ఎనర్జీ రావడమే కాకుండా ఎసిడిటీ కూడా తగ్గిపోతుంది. 
 

Telugu

ఓట్మీల్

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే ఓట్ మీల్ ను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం తగ్గుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. 
 

Image credits: Getty
Telugu

అల్లం

అల్లంలో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైములు కూడా ఉంటాయి. అల్లాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
 

Image credits: Getty
Telugu

పుచ్చకాయ

పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ ఎసిడిటీని తగ్గించడానికి, మన జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

Image credits: Getty
Telugu

కీరదోసకాయలు

కీరదోసకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిని తింటే ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణ సమస్యలు రావు. 
 

 

Image credits: Getty
Telugu

క్యారెట్లు

క్యారెట్లు ఫైబర్ కు మంచి మూలం. వీటిని తినడం వల్ల కళ్లు బాగా కనిపించడంతో పాటుగా ఎసిడిటీ సమస్య కూడా తగ్గిపోతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

కొబ్బరి నీరు

కొబ్బరి నీరు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే ఈ వాటర్ ను తాగితే ఎసిడిటీ కూడా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

నారింజ పండ్లను తినట్లేదా? అయితే మీరు ఈ లాభాలను మిస్సైనట్టే..

రోజూ బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డును తింటే ఏమౌతుందో తెలుసా?

జుట్టు ఒత్తుగా పెరగాలంటే వీటిని తినండి

పండ్లను తింటూ కూడా బరువు తగ్గొచ్చు తెలుసా?