Lifestyle
జీరా వాటర్ ను తాగడం వల్ల జీర్ణక్రియలో సహాయపడే ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. దీంతో కడుపు ఉబ్బరం, అజీర్థి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీరా వాటర్ మీ జీవక్రియను పెంచుతుంది. అలాగే కొవ్వు మరింత ఎక్కువగా కరగడానికి మీ శరీరానికి సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
జీలకర్ర నీటిని తాగడం వల్ల మన శరీర రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. దీంతో శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ప్రభావం తగ్గుతుంది.అంటువ్యాధులు ఇతర రోగాల ముప్పు కూడా తగ్గుతుంది.
జీలకర్ర నీటిని తాగితే శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయని నమ్ముతారు. దీనిలో నిర్విషీకరణ లక్షణాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి మన శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
జీలకర్రలో పుష్కలంగా ఉంటే యాంటీఆక్సిడెంట్లు మన చర్మాన్ని, జుట్టును , మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.