Lifestyle
పచ్చి మిరపకాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
పచ్చి మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడానికి, కేలరీలను కరిగించడానికి సహాయపడుతుంది. ఇది మీ బరువును నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మీ కణాలను రక్షించడానికి సహాయపడుతాయి.
పచ్చి మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ మన నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని నరాల వ్యాధి, కీళ్లనొప్పులు, మైగ్రేన్లు నొప్పిని తగ్గించడానికి క్రీములు, ప్యాచ్‌లల్లో ఉపయోగిస్తారు.
పచ్చి మిరపకాయలను తినడం వల్ల మన జీర్ణక్రియ బాగా పనిచేస్తుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. మిరపకాయలతో వచ్చే వేడి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
పచ్చిమిరపకాయల్లోని క్యాప్సైసిన్ హైబీపీని, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. సమతుల్య ఆహారంలో దీన్ని తీసుుకంటే గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
పచ్చి మిరపకాయలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. దీంత మీ శరీరం ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలకు దూరంగా ఉంటుంది.