Lifestyle

రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? వీటిని తినండి.. ఇట్టే నిద్రపడుతుంది

Image credits: Getty

చెర్రీ

చెర్రీ జ్యూస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ జ్యూస్ లో మనలకు నిద్రపట్టేలా చేసే మెలటోనిన్ అనే పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. చెర్రీ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే నిద్రపడుతుంది

Image credits: Getty

అరటి పండ్లు

అరటి పండ్లు కూడా కంటినిండా నిద్రపోవడానికి సహాయపడతాయి. ఈ పండ్లలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు బాగా నిద్రవచ్చేలా చేస్తాయి. వీటిని తింటే ప్రశాంతంగా పడుకుంటారు. 
 

Image credits: Getty

కివీ

కివీలో మంచి పోషకాల బాంఢాగారం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తిన్నా కూడా మీరు రాత్రిళ్లు కంటినిండా నిద్ర పోతారు. 
 

 

Image credits: Getty

పాలు

పాలు సంపూర్ణ ఆహారం. వీటితో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలను తాగితే తొందరగా నిద్ర పడుతుంది. 

Image credits: Getty

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్  లను ఇష్టపడనివారుండరు. నిజానికి ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.  అయితే వీటిలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది మనకు బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

బాదం పప్పు

బాదంలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే దీనిలో ఉండే మెగ్నీషియం నిద్రను కలిగించే మెలటోనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇది మీరు నిద్రపోవడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty

వాల్ నట్స్

వాల్ నట్స్  కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడతాయి.
 

 

Image credits: Getty

గుమ్మడికాయ గింజలు

కాల్చిన గుమ్మడికాయ గింజలు కూడా మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, జింక్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
 

Image credits: Getty

పచ్చి మిరపకాయలను తింటే ఇన్ని సమస్యలు తగ్గుతయా?

మందులు వాడకుండా మలబద్దకాన్ని తగ్గించే చిట్కాలు

రోజూ బొప్పాయిని తింటే..!

ఈ మసాలా దినుసులు కూడా షుగర్ ను తగ్గిస్తయ్ తెలుసా?