లవంగాలను ఒక మసాలా దినుసు గానే తీసుకుంటాం. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
Image credits: Getty
లవంగం ప్రయోజనాలు
లవంగాలను ఆయుర్వేదంలో.. ఎన్నో మందుల్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే దీనిలో ఉండే ఔషదగుణాలు, లక్షణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
Image credits: Getty
లవంగాల్లోని పోషకాలు
లవంగాలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్ తో పాటుగా మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
Image credits: Getty
కలరా
లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. వీటిని తింటే కలరా వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Getty
డయాబెటీస్
మధుమేహంతో సహా ఎన్నో వ్యాధులకు ఇది వంశపారంపర్య ఔషధంగా ఉపయోగపడుతుంది. లవంగాలను తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
Image credits: Getty
రోగనిరోధక వ్యవస్థ
మన రోగనిరోధక వ్యవస్థ ఎంత బలంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా, ఎలాంటి రోగాలు లేకుండా ఉంటాయి. కాగా లవంగాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
Image credits: Getty
అల్సర్లు
లవంగాల్లో ఉండే సమ్మేళనాలు అల్సర్లను నయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. లవంగాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచి వీటిని తగ్గించడానికి సహాయపడతాయి.