Lifestyle
కాఫీ కొవ్వు కాలేయ వ్యాధిని నివారించడానికి సహాయపడుతుందని 2021 లో ఒక అధ్యయనం పేర్కొంది. కానీ చక్కెరను ఎక్కువగా వేయకూడదు. కాఫీని ఎక్కువగా తాగకూడదు.
బచ్చలికూరతో సహా ఆకుకూరలకు ఫ్యాటీ లివర్ డిసీజ్ ను నిరోధించే గుణం ఉంటుంది. ఈ ఆకుకూరలు మీ శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.
మీ రోజువారి ఆహారంలో గింజలు, చిక్కుళ్లను చేర్చండి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల కొవ్వు కాలేయ వ్యాధి తొందరగా తగ్గిపోతుంది. ఫ్యూచర్ లో వచ్చే అవకాశం కూడా ఉండదు.
వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. వెల్లుల్లి ఫ్యాటీ లివర్ డిసీజ్ తో పోరాడటానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు కొవ్వు కాలేయంతో పోరాడటానికి కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
గింజలు కొవ్వు కాలేయ వ్యాధితో పోరాడటానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు రోజూ గుప్పెడుగింజలను తింటే ఎన్నో రోగాలొచ్చే అవకాశం తగ్గుతుంది.
పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీనిలో ఉండే కర్కుమిన్ మిమ్మల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తుంది. ఇది ఫ్యాటీ లివర్ డిసీజ్ తో కూడా పోరాడుతుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే కొవ్వు చేపలు కొవ్వు కాలేయ వ్యాధిని తొందరగా తగ్గించడానికి, నివారించడానికి సహాయపడతాయి.
ఆల్కహాల్, తీయని పానీయాలు, వేయించిన ఆహారాలు, తెల్ల పిండి వంటి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి ఫ్యాటీ లివర్ సమస్యను కలిగిస్తాయి.