Telugu

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవి

Telugu

సిట్రస్ పండ్లు

నిమ్మకాయ, నారింజ, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇదొక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్.
 

Image credits: Getty
Telugu

బెర్రీలు

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ బెర్రీలు వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. 
 

Image credits: Getty
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మీ రోజువారి ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 
 

Image credits: Freepik
Telugu

బచ్చలికూర

విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే బచ్చలికూర మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో రోగనిరోధక పనితీరుకు మద్దతునిచ్చే బీటా కెరోటిన్, విటమిన్ సి లు కూడా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

అల్లం

అల్లం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తూనే ఆహారాలను టేస్టీగా చేస్తుంది. 
 

Image credits: Pexels
Telugu

బాదం

బాదంపప్పులు విటమిన్ ఇ కి మంచి వనరులు. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. 
 

Image credits: Getty
Telugu

పసుపు

పసుపులోని క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. 

Image credits: Getty

శరీరంలో రక్తాన్ని పెంచే ఆహారాలు ఇవి..!

ఒంట్లో కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుందంటే?

కివీ పండుగను రోజూ తింటే ఇంత మంచిదా?

కాలెయ వ్యాధులు రావొద్దంటే ఇలా చేయండి