Lifestyle
రోజుకు ఒకసారైనా పెరుగును ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పెరుగులో విటమిన్ బి2, విటమిన్ బి12, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
పెరుగులో పుష్కలంగా ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది మన మనసును, శరీరాన్ని మరింత ఉల్లాసంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.
పెరుగులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఈ కాల్షియం మన ఎముకలను, దంతాలను బలంగా, ఆరోగ్యంగా చేస్తుంది. పెరుగు ఎలాంటి ఆహారాన్నైనా సులువుగా జీర్ణం చేస్తుంది.
పెరుగును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అల్సర్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ప్రతిరోజూ ఒకసారైనా పెరుగును తినండి.
పెరుగును తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గుండె జబ్బుల ముప్పు కూడా తప్పుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, అధిక రక్తపోటును తగ్గించడానికి పెరుగు సహాయపడుతుంది. పెరుగును తింటే అధిక రక్తపోటు సమస్య వచ్చే అవకాశం తగ్గుతుంది.
పెరుగును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. ఇది మన ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది.