Lifestyle
తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించి ప్రతి 2-3 రోజులకోసారి మీ జుట్టును వాష్ చేయాలి. ఇది మీ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది.
మీ జుట్టును వాష్ చేయడానికి గోరువెచ్చని లేదా చల్లని నీటిని ఉపయోగించండి. చల్లని నీరు మీ వెంట్రుకల మూలాలను బలపరుస్తుంది. అలాగే మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
మీ జుట్టు రకాన్ని బట్టి షాంపూలు, కండీషనర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే స్ట్రెయిట్, కర్లీగా జుట్టు కు వేరు వేరు హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడాల్సి ఉంటుంది.
హెయిర్ డ్రైయ్యర్ మీ జుట్టు క్యూటికల్స్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల జుట్టు తెగిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే మీ జుట్టును గాలికే ఆరనివ్వండి.
ప్రతి 6 నుంచి 8 వారాలకు మీ జుట్టును కత్తిరించండి. ఇది మీ వెంట్రుకల చివర్లు రెండుగా చీలిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం చాలా అవసరం. మీ భోజనంలో సాల్మన్, గుడ్లు, గింజలు, ఆకు కూరలు వంటి ఆహారాలను చేర్చండి.
కాటన్ పిల్లో కేసులు మీ జుట్టును దెబ్బతీస్తాయి. అందుకే సిల్క్ లేదా శాటిన్ పిల్లోకేసులను ఉపయోగించండి. రాత్రిపూట మీ జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది.