చామంతి టీలో ఎన్నో ఔషదగునాలు ఉంటాయి. ఈ టీ ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను పోగొడ్డటానికి సహాయపడుతుంది. ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది.
అశ్వగంధ టీ
అశ్వగంధలో శక్తివంతమైన ఔషధ గుణాలు దాగున్నాయి. ఈ అశ్వగంధ మొక్క టీ నిద్రను ప్రేరేపించే సమ్మేళనాలను కలిగి ఉంటుంది.
చెర్రీ రసం
చెర్రీలల్లో ట్రిప్టోఫాన్ కంటెంట్ ఉంటుంది. ఇది మనం హాయిగా నిద్రపోవడానికి సహాపడతాయని నిపుణులు చెబుతున్నారు. చెర్రీ రసం మన శరీరానికి ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది.
పుదీనా టీ
దీన్ని లామియాసి అని కూడా పిలుస్తారు. పుదీనా కుటుంబానికి చెందిన మూలికలు నిద్ర అలవాట్లను మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి.
పసుపు పాలు
పసుపు కలిపిన పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది నిద్రలేమి ప్రభావాలను తగ్గిస్తుంది.
వెచ్చని పాలు
వెచ్చని పాలు కూడా హాయిగా నిద్రపోవడానికి బాగా సహాయపడతాయి. పాలలో మనం నిద్రపోవడానికి సహాయపడే ట్రిప్టోఫాన్ కూడా ఉంటుంది.
Banana-almond smoothie
అరటిపండ్లు, బాదం పాలను స్మూతీలో కలిపి తీసుకోవడం వల్ల మీ శక్తిస్థాయిలు పెరుగుతాయి. వీటిలో ట్రిప్టోఫాన్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి నిద్రలేమి లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతాయి.