Lifestyle

డెంగ్యూ, మలేరియాను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు మీకోసం..

Image credits: Pixabay

బొప్పాయి ఆకు రసం

డెంగ్యూ జ్వరంలో వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ బాగా తగ్గుతుంది. అయితే ఈ ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచే సామర్థ్యం కోసం బొప్పాయి ఆకు సారానికి ఉందనిగుర్తించబడింది.
 

Image credits: Pixabay

వేప ఆకులు

వేపాకుల్లో శక్తివంతమైన యాంటీ మలేరియా, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
 

Image credits: Pixabay

గిలోయ్

గిలోయ్ లో శక్తివంతమైన యాంటి పైరేటిక్ లక్షణాలు ఉంటాయి. అందుకే దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
 

Image credits: Pixabay

తులసి

తులసి ఆకుల్లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. తులసి ఎన్నో రోగాలను నయం చేస్తుంది. ప్రతిరోజూ కొన్ని తాజా తులసి ఆకులను నమిలితే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

Image credits: Pixabay

ద్రాక్షపండు

ద్రాక్షలో సహజమైన క్వినైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ మలేరియా లక్షణాలను కలిగి ఉంటుంది. మలేరియా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. 
 

Image credits: Pixabay

కొబ్బరి నీరు

డెంగ్యూ, మలేరియా వచ్చినప్పుడు శరీరం అవసరమైన ద్రవాలు ఉండవు. అందుకే ఇలాంటి సమయంలో కొబ్బరి నీటిని తాగాలి. ఇది శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.

Image credits: Pixabay

అల్లం

అల్లంలో శోథ నిరోధక, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉంటాయి. అల్లం టీ తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది. అలాగే డెంగ్యూ, మలేరియాల లక్షణాలు తగ్గుతాయి. 
 

Image credits: Pixabay

వెల్లుల్లి

వెల్లుల్లి శక్తి వంతమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది డెంగ్యూ, మలేరియా రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 
 

Image credits: Pixabay

ఎచినాసియా

ఎచినాసియా అనేది రోగనిరోధక శక్తిని ప్రేరేపించే లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఒక మూలిక. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, రికవరీ ప్రక్రియకు కూడా సహాయపడుతుంది.
 

Image credits: Pixabay

సరైన విశ్రాంతి, హైడ్రేషన్

మీరు హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు, హెర్బల్ టీలు, తాజా పండ్ల రసాలు వంటి ద్రవాలను పుష్కలంగా తాగండి. మీ శరీరం కోలుకోవడానికి తగినంత విశ్రాంతిని కూడా తీసుకోండి.

Image credits: Pixabay
Find Next One