జుట్టు రాలడాన్ని తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు మీకోసం..
కొబ్బరి నూనే
కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనె హెయిర్ ఫోలికల్స్‌కు మంచి పోషణనిస్తుంది. హెయిర్ షాఫ్ట్‌లను బలపరుస్తుంది. అలాగే స్కాల్ప్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
కలబంద
కలబందలో జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడే ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఇందుకోసం తాజా అలోవెరా జెల్‌ని తీసి మీ తలకు నేరుగా అప్లై చేయండి
ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. .
గ్రీన్ టీ
గ్రీన్ టీ మీ స్కాల్ప్, హెయిర్‌కి అప్లై చేసి గంట పాటు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. గ్రీన్ టీ హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరుస్తుంది. అలాగే జుట్టును బలపరుస్తుంది.
ఎగ్ ప్యాక్
కోడిగుడ్లలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణనిచ్చి బాగా పెరిగేలా చేస్తాయి. ఇందుకోసం గుడ్డును గిలకొట్టి జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచండి
మెంతులు
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మెంతులు ఉపయోగపడతాయి. ఇందుకోసం మెంతులను రాత్రంతా నానబెట్టి పొద్దున వాటిని పేస్ట్‌లా చేసి మీ తలకు పట్టించండి.
ఉసిరికాయ
ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, జుట్టు పెరిగేందుకు సహాయపడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.