Telugu

Kitchen Sink:దీనితో శుభ్రం చేస్తే సింక్ కొత్త దానిలా మెరిసిపోవడం పక్కా

Telugu

పాత సింక్ కొత్త దానిలా మెరిపించండి...

మనం కిచెన్ క్యాబినెట్లు, కౌంటర్ టాప్ లను ఎలా శుభ్రం చేస్తామో, సింక్ ను కూడా అలా శుభ్రం చేయాలి.  వంటగది సింక్ క్లీన్ చేయడానికి ఈ చిన్న చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. 

Image credits: Getty
Telugu

బేకింగ్ సోడా

నీటిలో బేకింగ్ సోడా కలిపి, ఆ పేస్ట్‌ను సింక్‌కు పట్టించాలి. కాసేపు అలాగే వదిలేసి, ఆ తర్వాత స్క్రబ్బర్‌తో బాగా రుద్ది నీటితో కడిగేస్తే సరిపోతుంది.

Image credits: Freepik
Telugu

నిమ్మరసం, బేకింగ్ సోడా

అరకప్పు నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని సింక్‌కు బాగా పట్టించి, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

Image credits: pinterest
Telugu

వెనిగర్

సింక్‌లో ముందుగా బేకింగ్ సోడా చల్లాలి. ఆ తర్వాత దానిపై కొద్దిగా వెనిగర్ పోయాలి. ఇప్పుడు స్క్రబ్బర్‌తో బాగా రుద్దితే సింక్ శుభ్రంగా మారుతుంది.

Image credits: Getty
Telugu

ఆలివ్ ఆయిల్

శుభ్రమైన గుడ్డపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని, సింక్‌ను బాగా తుడవాలి. ఇలా చేయడం వల్ల సింక్ మరింత మెరుస్తూ, కొత్తదానిలా కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

చుట్టుపక్కల కూడా శుభ్రం చేయాలి

సింక్‌ను శుభ్రం చేయడంతో పాటు, దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా క్లీన్ చేయాలి. ఒకవేళ మీది స్టీల్ సింక్ అయితే, బ్లీచ్ ఉన్న క్లీనర్లు, గరుకుగా ఉండే స్క్రబ్బర్లను అస్సలు వాడొద్దు.

Image credits: Freepik

Honey Water: పరగడుపున హనీ వాటర్ తాగుతున్నారా?ఇవి కచ్చితంగా తెలుసుకోండి

Cushion Cover: డెడ్ చీప్‌గా సోఫా మేకోవర్..అదిరిపోయే 8 ఫ్యాన్సీ కుషన్స్

Gas Stove: గ్యాస్ పొయ్యి మండట్లేదా? ఇదొక్కటి చేయండి

Pearl Ring: చేతుల అందాన్ని పెంచే ముత్యాల ఉంగరాలు