డ్రాగన్ ఫ్రూట్ సాగు కోసం ఆరోగ్యకరమైన మొక్క నుంచి పది అంగుళాల పొడవున్న కొమ్మను కట్ చేయాలి. దానిని 2-3 రోజులు నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మట్టిలో నాటుకోవాలి. నీరు నిలవని నేలలోనే పాతాలి.
Image credits: Getty
Telugu
సూర్యరశ్మి తప్పనిసరి
ఈ మొక్కకు రోజూ 6 నుంచి 8 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగలాలి. మట్టి, వర్మి కంపోస్ట్, కోకోపీట్ అన్ని సమాన నిష్ఫత్తిలో కలిపి పెద్ద కుండీలో ఈ మొక్కను నాటడం ఉత్తమం.
Image credits: Getty
Telugu
సపోర్టు ఇవ్వండి
ఇది పాకే మొక్క. కాబట్టి దీనికి ఆధారం అవసరం. కాంక్రీట్ స్తంభాలు లేదా చెక్క కర్రలను ఉపయోగించి మొక్కను పైకి పాకించేలా చేయవచ్చు.
Image credits: Getty
Telugu
సేంద్రియ ఎరువులే మేలు
ఈ మొక్కకు ఎక్కువ నీరు అవసరం లేదు. నేలలో తేమను చూసుకుని నీరు పోయాలి. సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది.
Image credits: Getty
Telugu
పంట కోత సమయం
మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో పూత వస్తుంది. పూత వచ్చిన నెల రోజుల్లో పండు తయారవుతుంది. పండు రంగు పచ్చ నుంచి గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారినప్పుడు కోత కోయవచ్చు.
Image credits: Getty
Telugu
తక్కువ స్థలంలోనే సాగు
డ్రాగన్ ఫ్రూట్ మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట. చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు.
Image credits: Getty
Telugu
సేంద్రియ పండ్లు మీ పెరట్లోనే
ఇంటి టెర్రస్‌పై లేదా పెరట్లో కొద్దిపాటి స్థలం ఉంటే చాలు మీరే స్వయంగా ఈ పండ్లను పండించుకోవచ్చు. ఎవరైనా ఈ సాగులో సులభంగా విజయం సాధించవచ్చు.