ప్రతినొప్పికి పెయిన్‌కిల్లర్స్ వాడేస్తున్నారా? అలా చేసే ముందు మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.
తలనొప్పి, ఒళ్లు నొప్పులు, పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం చాలామంది పెయిన్‌కిల్లర్స్ వాడుతుంటారు.
పెయిన్‌కిల్లర్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే దొరుకుతాయి. కానీ వీటిని ఎక్కువగా వాడితే కిడ్నీలు దెబ్బతింటాయన్న విషయం చాలామందికి తెలియదు.
మనం సాధారణంగా వాడే ఇబుప్రోఫెన్, డైక్లోఫెనాక్ వంటి పెయిన్‌కిల్లర్స్.. NSAIDల (నాన్-స్టెరాయిడల్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్) గ్రూప్‌కు చెందినవి.
ఈ మందులు వాపును తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కానీ అదే సమయంలో కిడ్నీలకు వెళ్లే రక్త ప్రసరణను కూడా తగ్గిస్తాయి.
ఈ మందులను సరైన మోతాదులో తీసుకుంటే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ, రోజూ లేదా అతిగా వాడితే మాత్రం కిడ్నీలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.
ఎక్కువ కాలం ఇలాగే వాడితే కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా దారితీయవచ్చు.
కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, షుగర్ లేదా బీపీ ఉన్నవాళ్లు, వృద్ధులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు మందులు వాడేవారికి పెయిన్‌కిల్లర్స్‌తో ప్రమాదం ఎక్కువ.
Teeth Whitening: ఈ సింపుల్ టిప్స్ తో పళ్లు తెల్లగా మెరిసిపోవడం పక్కా!
Cardamom Water: పరగడుపున యాలకుల నీళ్లు తాగితే ఇన్ని లాభాలా?
Honey Water: పరగడుపున హనీ వాటర్ తాగుతున్నారా?ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Stress Relief foods: ఒత్తిడిని తగ్గించే 6 సూపర్ ఫుడ్స్ ఇవిగో!