టైర్లలో సరిగ్గా గాలి లేకపోతే.. పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుంది. ప్రతి 15 రోజులకి గాలి చెక్ చేయించుకోవాలి.
బండి స్టార్ట్ చేసి 5 నిమిషాలు ఆగడం అంటే ఫ్యూయల్ వృథా అవుతుంది. కాబట్టి వెంటనే బండి నడపండి. స్పీడ్ నెమ్మదిగా పెంచండి.
క్లచ్ ఎక్కువసేపు నొక్కి ఉంచితే పెట్రోల్, డీజిల్ ఖర్చవుతుంది. అవసరం అయినప్పుడే క్లచ్ వాడండి.
ఎప్పుడూ ఫుల్ ట్యాంక్ చేయడం వల్ల బండి బరువు పెరుగుతుంది. సగం ట్యాంక్ చేసుకుంటే చాలు. ఫ్యూయల్ ఆదా అవుతుంది.
అవసరం అయినప్పుడే ఏసీ వాడండి. లేకపోతే పెట్రోల్ గాలిలో కలిసిపోతుంది.