Lifestyle

అరటిపండ్లు

అరటిపండ్లలో ఉండే అమైనో ఆమ్లం 'ట్రిప్టోఫాన్' 'సెరోటోనిన్' ఉత్పత్తికి పోషణనిస్తుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అరటిపండ్లు మీకు తక్షణ శక్తిని కూడా ఇస్తాయి. 
 

Image credits: Getty

డార్క్ చాక్లెట్

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న డార్క్ చాక్లెట్ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా సహాయపడుతుంది.
 

Image credits: Getty

గింజలు

రోజూ గుప్పెడు గింజలను తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్-ఇ మీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Image credits: Getty

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఫైబర్, మినరల్స్ సమృద్ధిగా ఉండే ఇవి మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
 

Image credits: Getty

సాల్మన్ ఫిష్

సాల్మన్ వంటి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలు మానసిక ఆరోగ్యానికి కూడా మంచివి. ఇవి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 

Image credits: Getty

పసుపు

పసుపును మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. పసుపులో ఉండే కర్కుమిన్ దీనికి సహాయపడుతుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది.
 

Image credits: Getty

పాలు, గుడ్లు

పాలు, గుడ్లు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం మీ శారీరక ఆరోగ్యాన్నే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇవి మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. 
 

Image credits: Getty

గ్రీన్ టీ

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే గ్రీన్ టీ మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ టీని తాగడం వల్ల మీరు బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. 

Image credits: Getty

లవంగాలను తినడం అలవాటు చేసుకుంటే..!

ఫ్యాటీ లివర్ తగ్గాలన్నా.. ఫ్యూచర్ లో సమస్య రాకూడదన్నా వీటిని తినండి

ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వీటిని అస్సలు తినకూడదు

పెరుగును రోజూ ఎందుకు తినాలంటే?