Lifestyle

పోషకాలు

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి, పొటాషియం లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు శరీరానికి అవసరమైన క్యాల్షియం, విటమిన్ డి కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి.
 

Image credits: Getty

అసంక్రామ్యత

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అంటువ్యాధులు, ఇతర రోగాల ముప్పు తగ్గుతుంది.
 

Image credits: Getty

జీర్ణం

ప్రతిరోజూ ఉదయం ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో అజీర్థి వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 

Image credits: Getty

మూత్రపిండాల ఆరోగ్యం

ఆరెంజ్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

ఆరెంజ్ జ్యూస్ ను కూడా రెగ్యులర్ గా తాగడం వల్ల మీ గుండె ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 
 

Image credits: Getty

కళ్ల ఆరోగ్యం

ఆరెండ్ జ్యూస్ లో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మన కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. 
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

ఆరెంజ్ జ్యూస్ మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ జ్యూస్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
 

Image credits: Getty

బరువు తగ్గాలంటే

ఆరెంజ్ జ్యూస్ లో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే బెల్లీ ఫ్యాట్  తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty
Find Next One