Kitchen Hacks: బీ కేర్ ఫుల్.. పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి..
life Jun 15 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
కడగడం
కూరగాయలను కడగడానికి ముందు మన చేతులు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల, ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను తొలగించవచ్చు.
Image credits: Getty
Telugu
అన్నింటినీ కలిపి కడగడం
ఆకు కూరలు, కూరగాయలను ఓకే దాంట్లో వేసి కడగటం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఒకదాని మీది మురికి, బ్యాక్టీరియా మరొక దానిమీదకు చేరతాయి. వీటన్నింటినీ వేరు వేరుగా కడిగి, కట్ చేయడం బెటర్.
Image credits: Getty
Telugu
సరిగ్గా కడగకపోవడం
కూరగాయలను కట్ చేసే ముందు బాగా కడగాలి. ముఖ్యంగా క్యారెట్లు, బంగాళాదుంపలు, బీట్‌రూట్ వంటి కూరగాయలు మట్టి పట్టుకుని ఉంటాయి. వాటిని రుద్ది కడిగితే తప్ప మట్టి, మురికి పోదు.
Image credits: Getty
Telugu
ఉప్పు నీటిలో
కూరగాయలను కడిగేటప్పుడు కేవలం నీటిలో మాత్రమే కడిగితే సరిపోదు. నీటిలో కాస్త ఉప్పు లేదా పసుపు వంటివి వేయాలి. అలా చేయడం వల్ల వాటిపై ఉండే రసాయనాలు, బ్యాక్టీరియా వంటి తొలగిపోతాయి.
Image credits: Getty
Telugu
గోరు వెచ్చని నీటిలో
కూరగాయలను చల్లని నీటిలో కడగడం కంటే గోరువెచ్చని నీటిలో కడగడం మంచిది. అలా చేయడం వల్ల రసాయన అవశేషాలు, మురికి పూర్తిగా పోవు. కావాలంటే కూరగాయలు కడగడానికి బ్రష్ వాడొచ్చు.
Image credits: Getty
Telugu
తడి లేకుండా
కడిగిన తర్వాత కూరగాయలు, పండ్లు బాగా తుడిచి వేయాలి. తడిగా ఉంటే క్రిములు పెరుగుతాయి.