ప్రీడయాబెటిస్ ఉన్నవారు అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే!
life Aug 04 2026
Author: Kavitha G Image Credits:Getty
Telugu
వేయించిన ఆహారాలు
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా, బర్గర్ వంటి వేయించిన ఆహారాలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ప్రీడయాబెటిస్ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
Image credits: Printerest
Telugu
చక్కెర కలిపిన డ్రింక్స్
చక్కెర కలిపిన డ్రింక్స్ రక్తంలో షుగర్ లెవల్స్‌ను అమాంతం పెంచేస్తాయి. వీటిలో ఆర్టిఫిషియల్ షుగర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి.
Image credits: Getty
Telugu
అధిక తీపి ఉన్న పండ్లు
పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా, అధికంగా తీపి ఉండే పండ్లను రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. మామిడి పండు లాంటివి మితంగా తీసుకోవాలి.
Image credits: Getty
Telugu
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు
వైట్ బ్రెడ్, వైట్ రైస్, మైదాతో చేసిన పదార్థాలలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి.
Image credits: Getty
Telugu
మద్యం
ప్రీడయాబెటిస్ ఉన్నవాళ్లు మద్యం సేవించడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచేస్తుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండాలి.
Image credits: Getty
Telugu
ప్యాకేజ్డ్ ఫుడ్స్
ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో అనారోగ్యకరమైన కొవ్వులు, ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.