మన జీవితం ఎలా ఉండాలో ఆచార్య చాణక్యుడు వేల సంవత్సరాల క్రితమే వివరించారు. ఇప్పటి వేగవంతమైన ప్రపంచంలో మనం ఓడిపోకుండా ఉండాలంటే.. ఆయన చెప్పిన ఈ 5 సూత్రాలను తప్పక పాటించాలి.
life Mar 27 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
సమయానికి విలువ ఇవ్వండి
గడిచిపోయిన సమయం మళ్లీ తిరిగి రాదు. మీరు ఏ పని చేసినా సమయాన్ని వృథా చేయకండి. సరైన సమయానికి పని పూర్తి చేయడమే విజయానికి మొదటి మెట్టు.
Image credits: Chatgpt
Telugu
భయాన్ని వదిలేయండి
మనసులో భయం ఉంటే ఏదీ సాధించలేం. భయపడకుండా మీ పనిలో ముందుకు సాగండి. భయపడితే ఓటమి ఖాయం, ధైర్యం చేస్తే గెలుపు మీదే అవుతుంది.
Image credits: Getty
Telugu
డబ్బు ఆదా చేయండి
అనవసరంగా డబ్బు ఖర్చు చేయకండి. డబ్బును వృథా చేస్తే భవిష్యత్తులో కష్టాలు తప్పవు. ఈ రోజు మీరు చేసే పొదుపే.. రేపటి మీ ప్రశాంతతకు ఆధారం.
Image credits: Getty
Telugu
ఆరోగ్యమే మహాభాగ్యం
సరైన సమయానికి నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఎలాంటి కష్టమైన పనైనా సులభంగా చేయగలడు.
Image credits: Getty
Telugu
చెడ్డవాళ్లకు దూరంగా ఉండండి
మీ నిజాయితీకి విలువ ఇవ్వని వాళ్లకు, మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించే వాళ్లకు దూరంగా ఉండండి. అలాంటి వాళ్ల స్నేహం మీ జీవితాన్నే నాశనం చేయగలదు.