ఆస్తమా లాంటి జబ్బులు ఉన్నవాళ్లు రూమ్ హీటర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది శ్వాస సమస్యలు, దగ్గుకు కారణమవుతుంది.
గదిలో తేమ తగ్గడం వల్ల పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువ. ఇది చర్మ సమస్యలకు దారితీస్తుంది.
రూమ్ హీటర్ వాడేటప్పుడు గదిలో దుమ్ము, ధూళి చేరి అలర్జీలు రావచ్చు.
కొన్నిసార్లు రూమ్ హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లాంటి విష వాయువులు వెలువడవచ్చు. కాబట్టి గదిలో గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి.
సరిగ్గా ఆపరేట్ చేయకపోవడం, వైరింగ్‌లో లోపాల వల్ల అగ్ని ప్రమాదాలు కూడా జరగవచ్చు.
రూమ్ హీటర్‌ను నిర్దిష్ట దూరంలో ఉంచాలి. కర్టెన్లు, ఫర్నిచర్ లాంటివి హీటర్ దగ్గర పెట్టకూడదు.
తేమ ఉన్న ప్రదేశాల్లో రూమ్ హీటర్ అస్సలు పెట్టకూడదు. ఇది పరికరం పాడవ్వడానికి, ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది.
ఎముకలు బలంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? ఇవి తింటే చాలు
వీటిని తిన్నారంటే ఎంతటి ఒత్తిడైనా తగ్గాల్సిందే
మీ చిన్నారికి ఈ గిఫ్ట్ ఇవ్వండి.. జీవితాంతం గుర్తుండిపోతుంది!