పాలకూర వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫోలేట్ అధికంగా0 ఉంటాయి. ఇవి మానసిక స్థితిని నియంత్రించే న్యూరోట్రాన్స్‌మిటర్‌లను అందిస్తాయి.
సాల్మన్, మాకేరెల్ వంటి చేపలు ఎంతో ఆరోగ్యం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి మానసిక ఆందోళనను తగ్గిస్తాయి.
నట్స్ మెదడు కోసం తినాల్సిందే. ఇవి నాడీ వ్యవస్థను శాంతపరిచే మెగ్నీషియం, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తాయి.
గుడ్లలో ప్రోటీన్, కోలిన్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి, మానసిక స్థితిని నియంత్రించడానికి సహాయపడతాయి.
బ్లూబెర్రీలలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరాన్ని కాపాడతాయి.
నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడితో కూడిన పరిస్థితులలో కార్టిసాల్, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. కనీసం 70 శాతం కోకో ఉన్న చాక్లెట్ మానసిక స్థితిని మెరుగుపరిచే గుణాలను అందిస్తుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ బి6, మెగ్నీషియంతో నిండిన అవకాడో రక్తంలో చక్కెరను స్థిరీకరించడానికి, మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
మీ చిన్నారికి ఈ గిఫ్ట్ ఇవ్వండి.. జీవితాంతం గుర్తుండిపోతుంది!
రోజూ క్యారెట్ తింటే ఏం జరుగుతుంది?
చలికాలంలో పగిలిన పెదవులకు తేనే పూస్తే చాలు
సాయంత్రం పూట వ్యాయామం చేస్తే ఏమౌతుంది?