Lifestyle

రోజుకో గుడ్డు తినమని ఎందుకు చెప్తారో తెలుసా?

Image credits: Getty

మెదడు ఆరోగ్యం

మదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజూ ఒక గుడ్డును తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఇందులోని విటమిన్లు, మినరల్స్‌ నాడీ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి. 
 

Image credits: Getty

బలమైన కండరాలు

కండరాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా గుడ్డు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ప్రోటీన్‌ కండరాలను స్ట్రాంగ్‌గా మారేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. 

Image credits: Getty

రోగనిరోధక వ్యవస్థ

తరచూ వ్యాధుల బారిన పడుండా ఉండాలంటే రోజూ ఒక గుడ్డును తీసుకోవాలి. ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ బి-12, సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 


 

Image credits: Getty

గర్భిణీలకు వరం

గర్భిణీలు కచ్చితంగా గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఫోలిక్‌ యాసిడ్‌ పుట్టబోయే బిడ్డల్లో లోపాలను నివారించడంలో ఉపయోగపడుతుంది. 
 

Image credits: adobe stock

కంటి ఆరోగ్యం

దీర్ఘకాలంలో కంటి సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలి. గుడ్డులోని లుటిన్, జియాక్సంతిన్ కంటి ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Image credits: PINTEREST

బరువు తగ్గడంలో

బరువు తగ్గాలనుకునే వారికి గుడ్డు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పాలి. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కోడి గుడ్డును తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. 

Image credits: Getty

విటమిన్‌ డి

విటమిన్‌ డీ లోపంతో బాధపడేవారు కూడా గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ ఒక గుడ్డును తీసుకుంటే విటమిన్‌ డీ లోపాన్ని జయించవచ్చు. 
 

Image credits: Getty

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

చలికాలంలో ఇడ్లీ,దోశ పిండి పొంగాలంటే ఏం చేయాలి?

స్ట్రాబెర్రీ రోజూ తింటే ఏమౌతుంది?

కుక్కర్‌లో ఇన్‌స్టంట్ చికెన్‌ బిర్యానీ.. బ్యాచిలర్స్‌ కూడా చేసుకోవచ్చు

త్రిష బ్యూటీ సీక్రెట్ ఇదే..!