Lifestyle
చికెన్: 500 గ్రా., బిర్యానీ మసాలా: 1/2 టీ స్పూన్, జీలకర్ర, ధనియాలు, కాశ్మీరీ మిర్చి, కారం పొడి ఒక్కోటి 1 టీ స్పూన్, వెల్లుల్లి-అల్లం పేస్ట్ తగినంత.
1 టీ స్పూన్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు: 4, పెరుగు: 5 టీ స్పూన్, బియ్యం: 2 గ్లాసులు (బాస్మతి), కేసరి: 2 రేకులు, నెయ్యి: 6 టీ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, లవంగాలు, యాలకులు 2
చికెన్‌ని ఒక పాత్రలో వేసి, వేయించిన ఉల్లిపాయలు, ధనియాలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టీ స్పూన్ల నెయ్యి, పెరుగు వేసి 15 నిమిషాలు మారినేట్ చేయాలి.
ఒక పాత్రలో 3 టీ స్పూన్ల నెయ్యి వేసి, లవంగాలు, యాలకులు వేయించాలి. తర్వాత మారినేట్ చేసిన చికెన్ వేసి, వేయించిన ఉల్లిపాయలు కలపాలి.
కేసరి, కొత్తిమీర, పుదీనా, బియ్యం వేసి, 3 గ్లాసుల నీళ్ళు, ఉప్పు వేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. అంతే వేడి వేడిగా రుచికరమైన బిర్యానీ రడీ అయినట్లే.
వేడి వేడి బిర్యానీకి నిమ్మరసం లేదా రైతా కలిపి తినవచ్చు. అలాగే పక్కన ఉల్లిపాయ ముక్కలను నంచుకుని తినొచ్చు. ఈ ట్రిక్ తో బ్యాచిలర్స్ కూడా సింపుల్ గా బిర్యానీ చేసుకోవచ్చు.