దోశ, ఇడ్లీ పిండి కోసం పప్పు, బియ్యం నానపెట్టే సమయంలో ఒక స్పూన్ మెంతులు కూడా వేయాలి. వాటితో కలిపి పిండి రుబ్బుకుంటే రుచి పెరగడమే కాకుండా, పిండి తొందరగా పొంగుతుంది.
వేడి నీళ్లతో రుబ్బుకోండి
ఇడ్లీ, దోశలకు బియ్యం, మినప్పప్పు రుబ్బుతున్నప్పుడు గోరువెచ్చని నీళ్ళు వాడండి. ఇది పొంగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
బ్యాటర్‌ని చేతితో కలపండి
బ్యాటర్ రుబ్బిన తర్వాత శుభ్రమైన చేతులతో బాగా కలపండి. చేతుల వేడిమి బ్యాక్టీరియా, పొంగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
వేడి ప్రదేశంలో ఉంచండి
బ్యాటర్‌ని త్వరగా పొంగేలా చేయడానికి ఓవెన్‌ని 10 నిమిషాలు వేడి చేసి, ఆపివేసి, బ్యాటర్ గిన్నెను అందులో ఉంచండి.
థర్మల్ బ్యాగ్ వాడండి
చలికాలంలో బ్యాటర్ గిన్నెను మందపాటి వేడి టవల్ లేదా థర్మల్ బ్యాగ్‌లో చుట్టండి. ఇలా చేసినా పిండి తొందరగా పొంగుతుంది.
చిటికెడు చక్కెర వేయండి
దోశ, ఇడ్లీ పిండిలో చిటికెడు చక్కెర వేయడం వల్ల పొంగే ప్రక్రియ వేగవంతమై 8-10 గంటల్లోనే బ్యాటర్ తయారవుతుంది.
ఉల్లిపాయ ముక్క వేయండి
బ్యాటర్‌ని పొంగానికి ఉంచేటప్పుడు ఒక ఉల్లిపాయ ముక్క వేయండి. ఇది పొంగడాన్ని వేగవంతం చేస్తుంది. తర్వాత ఉల్లిపాయ తీసేయండి.