Lifestyle
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడం అంత సులువైన పని కాదని మనలో చాలా మందికి తెలుసు. కానీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను తింటే ఇది నెమ్మదిగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
విసెరల్ కొవ్వు, లేదా కడుపులో పేరుకుపోయే కొవ్వు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. అందుకే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.
బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఆహారం పాత్ర ఎనలేనిది. ఈ డ్రై ఫ్రూట్స్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఏం తినాలంటే?
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడే పోషకమైన ఆహారం బాదం. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి మీరు అతిగా తినకుండా కాపాడుతాయి.
ప్రతిరోజూ గుప్పెడు వాల్ నట్స్ ను తినడం అలవాటు చేసుకుంటే మీ బెల్లీ ఫ్యాట్ సులువుగా తగ్గుతుంది. అలాగే మీ బరువు కూడా అదుపులో ఉంటుంది.
ఎండుద్రాక్షల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టి తినడం వల్ల బరువు తగ్గొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఆప్రికాట్ పండ్లలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్ సమృద్ధిగా ఉండే ఈ పండ్లు గర్భిణీ స్త్రీలు తినగలిగే బెస్ట్ డ్రై ఫ్రూట్స్. ఇది కూడా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.