Telugu

Tulsi Plant: గింజలు ఇలా చల్లినా తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది

Telugu

తులసి గింజలు...

తులసి మొక్క పూల గుత్తులుగా వచ్చి, అవి పూర్తిగా ఎండిపోయినప్పుడు వాటిని కత్తిరించాలి. వాటిని చేతితో నలిపితే నల్లటి విత్తనాలు వస్తాయి. ఈ విత్తనాలతో మొక్కను పెంచొచ్చు. 

Image credits: Getty
Telugu

విత్తనాలు నాటే విధానం (Sowing Process)

ఒక కుండీలో 50% మట్టి, 50% సేంద్రియ ఎరువు (వర్మీకంపోస్ట్) కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోండి.

Image credits: instagram
Telugu

7-10 రోజుల్లో చిన్న మొక్కలు

విత్తనాలను మట్టిపై చల్లి, దానిపై పలుచగా మట్టి పొరను కప్పండి. రోజూ తేలికగా నీళ్లు చల్లండి. 7 నుంచి 10 రోజుల్లో చిన్న మొక్కలు మొలకెత్తుతాయి.

Image credits: instagram
Telugu

గుబురుగా పెరగడానికి 'పించింగ్' టెక్నిక్ (Pinching Technique)

మీ తులసి మొక్క పొడవుగా కాకుండా గుబురుగా పెరగాలంటే 'పించింగ్' చేయాలి. మొక్క 5-6 అంగుళాలు పెరిగాక, దాని చివర్లో ఉండే రెండు ఆకుల చిగుళ్లను కత్తిరించండి.  కొమ్మలు బాగా పెరుగుతాయి.

Image credits: Getty
Telugu

అవసరమైన పోషకాలు (Nutrients)

పేడ ఎరువు: నెలకు ఒకసారి, ఎండిన పశువుల ఎరువును మట్టిలో కలపండి.

ఎప్సమ్ సాల్ట్ (Epsom Salt): ఒక లీటరు నీటిలో అర చెంచా ఎప్సమ్ సాల్ట్ కలిపి ఆకులపై స్ప్రే చేస్తే పచ్చగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

టీ పొడి

వాడిన టీ పొడిని బాగా కడిగి, ఆరబెట్టి మట్టిలో వేయడం వల్ల మొక్కకు నత్రజని (Nitrogen) అందుతుంది.

Image credits: Getty
Telugu

సూర్యరశ్మి & నీరు (Sunlight & Water)

తులసి మొక్కకు రోజుకు కనీసం 4 నుంచి 6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగలాలి. కుండీలో నీరు నిలిచిపోకుండా చూసుకోండి. మట్టి పైపొర ఆరినప్పుడు మాత్రమే నీరు పోయాలి. ఎక్కువ నీరు పోయవద్దు.

Image credits: Getty

Curry Leaves: ఈ ఒక్కటి వేస్తే కరివేపాకు మొక్క ఫాస్ట్ గా పెరుగుతుంది!

Gardening Tips: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో..!

Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలో తెలుసా?

Curry Leaf: ఎండాకాలంలో ఇలా చేస్తే కరివేపాకు గుబురుగా పెరుగుతుంది