Health

ఛాతీ నొప్పి

గుండెపోటు వచ్చేమందు ఛాతీలో నొప్పి కలుగుతుంది. గుండెపోటు వచ్చే ముందు ఛాతీ నొప్పి, ఛాతీ అసౌకర్యం, మెడ, దవడ నొప్పి వంటి లక్షణాలన్నీ గుండె సంబంధ సమస్యలను సూచిస్తాయి.
 

Image credits: Getty

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

శ్వాస ఆడకపోవడం కూడా గుండె సంబంధిత రోగాల లక్షణాలే. ఆటల్లో నిమగ్నమైనప్పుడు శ్వాస ఆడదు. ఇది కూడా మీ గుండె ప్రమాదంలో ఉందని సూచిస్తుంది. 
 

Image credits: Getty

హృదయ స్పందన రేటు

గుండె ప్రమాదంలో ఉంటే మీ హృదయ స్పందన రేటులో కూడా తేడాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా మీ గుండెకు ఇబ్బందిని కలిగిస్తుంది. 
 

Image credits: Getty

అలసట

పని చేసినప్పుడు అలసిపోవడం చాలా కామన్. కానీ అసాధారణ అలసట మీ ఆరోగ్యం రిస్క్ లో ఉందని సంకేతం ఇస్తుంది. ఇలాంటి సమయంలో హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 
 

Image credits: Getty

కళ్లు తిరగడం

మైకం, స్పృహ కోల్పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఇవి కూడా గుండె సమస్యలకు సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 

Image credits: Getty

దగ్గు

కాలానుగుణ మార్పుల కారణంగా దగ్గు వస్తుంటుంది. అయితే ఇలాంటి దగ్గు కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది. అయితే నిరంతర దగ్గు కొంతమందిలో గుండె సమస్యలకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.

Image credits: Getty

వికారం, వాంతి

కడుపు నొప్పి, వికారం, వాంతులు, అజీర్ణం వంటి సమస్యలు కూడా హృదయ సంబంధ సమస్యల లక్షణమేనంటున్నారు నిపుణులు. 
 

Image credits: Getty
Find Next One