గుడ్డు వాసన బల్లులకు నచ్చదు. కాబట్టి బల్లులు వచ్చే ప్రదేశాలలో గుడ్డు పెంకులు పెట్టడం మంచిది. ఇది బల్లుల ఉనికిని తగ్గిస్తుంది.
ఉల్లిపాయ, వెల్లుల్లి వాసనను కూడా బల్లులు తట్టుకోలేవు. కాబట్టి ఉల్లి, వెల్లుల్లి రసాన్ని కొద్దిగా నీటిలో కలిపి చల్లాలి.
ఒక స్ప్రే బాటిల్‌లో నీళ్లు, మిరియాల పొడి, కొంచెం కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు బల్లులు కనిపించే చోటల్లా దీన్ని స్ప్రే చేయాలి.
బల్లులు వచ్చే అవకాశం ఉన్న ప్రదేశాలలో కాఫీ పొడి చల్లవచ్చు. ఎందుకంటే కాఫీ పొడి వాసన బల్లులకు ఇబ్బంది కలిగిస్తుంది.
బల్లులు ఎక్కువ వేడిని లేదా చలిని తట్టుకోలేవు. కాబట్టి బల్లులు వచ్చే ప్రదేశాలలో చల్లటి నీటిని చల్లితే వాటిని తరిమికొట్టవచ్చు.
బల్లులు వచ్చే ప్రదేశాలలో వెనిగర్ చల్లండి. ఎందుకంటే వెనిగర్ ఘాటైన వాసన బల్లులు రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
రాత్రిపూట తినేందుకు తక్కువ కేలరీల ఫుడ్స్ ఇవిగో
ఈజీగా బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు!
మహిళల్లో బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణం ఇదే
నార్మల్ మెహందీ కాదు.. ఇవి 3డి మోడల్ మోహందీ డిజైన్స్