Lifestyle

కొలెస్ట్రాల్

మంచి కొలెస్ట్రాల్ వల్ల మనకు వచ్చే తిప్పలేమీ లేదు. కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతేనే గుండెపోటు వంటి ఎన్నో డేంజర్ సమస్యలు వస్తాయి. 
 

Image credits: google

కొలెస్ట్రాల్

ఈ చెడు కొలెస్ట్రాల్  మన ధమనుల్లో పేరుకుపోయి వాటికి అడ్డంకిని కలిగిస్తుంది. దీనివల్ల రక్తం సరఫరా సరిగ్గా జరగదు. ఇది మన ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. 
 

Image credits: google

అధిక కొలెస్ట్రాల్

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు కూడా ఈ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే? 
 

Image credits: google

చిక్కుళ్లు

చిక్కుళ్లు పోషకాలకు మంచి వనరు. ఇవి మన శరీరానికి ఎన్నో రకాల ప్రోటీన్లను అందించడంతో పాటుగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయడపతాయి. 
 

Image credits: google

వెల్లుల్లి

వెల్లుల్లి మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని పచ్చిగా తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్  తగ్గిపోతాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. 
 

Image credits: google

వాల్ నట్స్

వాల్ నట్స్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటే ఈ వాల్ నట్స్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

Image credits: google

చియా విత్తనాలు

చియా విత్తనాలు కూడా పోషకాలకు మంచి వనరు. వీటిని తింటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడుతాయి. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. 
 

Image credits: google

అవొకాడో

అవోకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పోషకాలకు మంచి వనరు. అవొకాడోలు కొలెస్ట్రాల్ ను తగ్గించడి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: google
Find Next One