Lifestyle

ఆకుకూరలు

ఆకు కూరల్లో మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని మన రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 
 

Image credits: Getty

ఆకుకూరల్లో పోషకాలు

ఆకుకూరల్లో మెగ్నీషియం, పొటాషియంతో పాటుగా ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: Getty

ఎముకలు, దంతాల ఆరోగ్యం

ఆకు కూరల్లో కాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి మన ఎముకలను, దంతాలను బలంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. 
 

Image credits: Getty

రక్తహీనత

మగవారితో పోలిస్తే ఆడవారే రక్తహీనతతో ఎక్కువగా బాధపడతారు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలను తింటే రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. 
 

Image credits: Getty

మలబద్ధకం

ఆకుకూరల్లో ఫైబర్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే గట్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. 

Image credits: Getty

శరీర బరువు

ఆకుకూరల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఆకు కూరలను తింటే ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. 
 

Image credits: Getty

కంటి ఆరోగ్యం

ఆకుకూరల్లో లుటిన్, జియాక్సంతిన్ లు కూడా మెండుగా ఉంటాయి. ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే కంటిచూపును పెంచుతాయి. 
 

Image credits: Getty

బ్లడ్ షుగర్

ఆకు కూరలు డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

ఇమ్యూనిటీ పవర్

ఆకుకూరల్లో విటమిన్ ఎ, విటమిన్ సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి.
 

Image credits: Getty

ఈ జ్యూస్ లను తాగితే మీ పొట్టకరగడం పక్కా..!

బీపీ పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి

ఈ ఆకులు మధుమేహులకు ఓ వరం..! ఎందుకంటే?

రాత్రిపూట ఈ ఆహారాలను ఎట్టి పరిస్థితిలో తినకండి.. ఎందుకంటే?