నెయ్యిలో ఉండే సంతృప్త కొవ్వులు గుండె జబ్బులు ఉన్నవారికి మంచిది కాదు. వీళ్లు నెయ్యి తినే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
లివర్ సమస్యలతో బాధపడేవాళ్లు నెయ్యి తినడం మంచిదికాదు. లివర్‌పై మరింత భారం పెరుగుతుంది. దీనివల్ల వాపు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవాళ్లు నెయ్యిని చాలా తక్కువగా తీసుకోవాలి. పరిమితికి మించి తింటే, అది సమస్యను మరింత పెంచుతుంది.
జ్వరం లేదా ఒంట్లో వాపులు ఉన్నప్పుడు నెయ్యి తినకూడదు. ఆ టైంలో నెయ్యి జీర్ణం కావడం కష్టమవుతుంది.
నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతుంటే నెయ్యి తినకపోవడమే మంచిది. ఇది మీ సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది.
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నెయ్యి తింటే సమస్య మరింత ఎక్కువవుతుంది.
నెయ్యిలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే, నెయ్యిని తక్కువగా తీసుకోవడం మంచిది.
Earrings: 1 గ్రాము బంగారంలో డైలీవేర్ ఇయర్ రింగ్స్, ఓ లుక్కేయండి
Earrings: చెవులకు నిండుగా అందమైన కమ్మలు.. చూస్తే వావ్ అనాల్సిందే!
ఆరు గ్రాముల్లో బంగారంతో లైట్ వెయిట్ చెవి కమ్మలు
Morning Routine : ఉదయం లేవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు?