క్యారెట్ల్లో బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ K1, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంటాయి.
క్యారెట్‌లోని బీటా కెరోటిన్ శరీరంలో చేరాక విటమిన్ A గా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
క్యారెట్లో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇక అందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి గుండె సేఫ్ గా ఉంటుంది.
క్యారెట్లో ఉండే డైటరీ ఫైబర్ మలవిసర్జనను క్రమబద్ధంగా ఉంచుతుంది, పేగుల్లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పోషిస్తుంది.
క్యారెట్‌లోని విటమిన్ A, C.. వ్యాధికారకాలు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
క్యారెట్లో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. నీటి శాతం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తిన్నాక త్వరగా ఆకలి వేయదు.
క్యారెట్లను ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. ఒక నెల పాటూ రోజూ తింటే చర్మం మెరిసిపోతుంది.
Anxiety Foods: గుండెల్లో గాభరాగా అనిపిస్తే వెంటనే వీటిని తినండి
Clove Tea: నార్మల్ టీ కాదు, లవంగం టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో..
Blouse Designs: చీరలకు గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజు బ్యాక్ డిజైన్లు
Makhana: రోజూ మఖానా తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?