Lifestyle

అందంగా కనిపించాలా? విటమిన్‌ E ఉండే ఈ ఫుడ్‌ తినాల్సిందే

Image credits: freepik

పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్స్‌

చర్మ కాంతిని పెంపొందించడంలో పాలకూర ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్‌, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు విటమిన్‌ ఈ పులష్కలంగా ఉంటుంది. 
 

Image credits: Social media

పల్లీలు

పల్లీల్లో కూడా విటమిన్‌ ఈ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యంతో పాటు చర్మాన్ని అందంగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

క్యాప్సికమ్‌

చర్మ ఆరోగ్యాన్ని రెట్టింపు చేయడంలో రెడ్‌ క్యాప్సికమ్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్‌ ఈ, సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతుంది. 
 

Image credits: Freepik

సన్‌ ఫ్లవర్‌ సీడ్స్‌

రోజు గుప్పెడు పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు మాములుగా ఉండవు. ఇందులోని విటమిన్‌ ఈ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. 
 

Image credits: canva

బాదం

విటమిన్‌ ఈ పుష్కలంగా ఉండే వాటిలో బాదం కూడా ఒకటి. రెగ్యులర్‌గో ఉదయాన్నే బాదంను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగై, అందం రెట్టింపు అవుతుంది. 

Image credits: Pinterest

అవకాడో

మనలో చాలా మంది అవకాడో పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ ఇందులో పుష్కలంగా ఈ విటమిన్‌ ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

Image credits: Getty

ఆలివ్‌ ఆయిల్‌

సాధారణంగా ఇతర నూనెలతో పోల్చితే ఆలివ్‌ ఆయిల్ చర్మానికి మేలు చేస్తుంది. ఈ ఆయిల్‌ను రెగ్యులర్‌గా ఉపయోగిస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 

Image credits: Getty

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

చికెన్‌లో ఈ పార్ట్ తింటున్నారా.? ప్రమాదంలో పడుతున్నట్లే

పెండ్లి చేసుకోకుండా కలిసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా

ఇక్కడ అబద్ధం మాత్రమే చెప్పాలి: ప్రేమానంద్ మహారాజ్

అన్నం ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా