Relations

పెండ్లి చేసుకోకుండా కలిసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా

కుటుంబ బంధాలు బలహీనపడతాయి

అవును లివ్-ఇన్ రిలేషన్షిప్ కుటుంబ వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగం, గౌరవాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే దీనిలో సామాజిక బంధం ఉండదు కాబట్టి.

సమాజ నైతికతపై ప్రభావం

లివ్-ఇన్‌ రిలేషన్ షిప్ లో ఉండేవారు సామాజిక, సాంస్కృతిక విలువలను పాటించరు.వైవాహిక సంబంధం లేకుండా కలిసి ఉంటారు. దీనివల్ల యువతపై చెడు ప్రభావం పడుతుంది.

పిల్లల భవిష్యత్తు అనిశ్చితం

లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో పిల్లల్ని కూడా కనేస్తుంటారు. కానీ వీరి సంబంధం తెగిపోతే వారి పిల్లలకు తల్లిదండ్రుల సంరక్షణ ఉండదు. భద్రతా దొరకదు. వీరికి చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

బాధ్యతలుండవ్

పెళ్లి చేసుకున్న వారిలా.. పెళ్లి చేసుకోకుండా కలిసుండే వారికి బాధ్యతలనేవే ఉండవు. దీనివల్ల సంబంధం స్థిరంగా ఉండదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు, భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తాయి. 

చట్టపరమైన, భద్రతా సమస్యలు

లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నవారికి పెళ్లిలాంటి చట్టపరమైన భద్రతనేది ఉండదు. దీనివల్ల వీరి మధ్య వివాదాలు వస్తే వీరికి చట్టం ఎలాంటి రక్షణ కల్పించదు.

సంబంధంలో స్థిరత్వ లేమి

పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే సంబంధాలు చాలా సులువుగా తెగిపోయే అవకాశం ఉంది.దీంతో ఇద్దరికీ ఒత్తిడి, అభద్రతా భావం పెరుగుతాయి. దీనివల్ల ఆత్మహత్య లాంటి ఆలోచనలు రావొచ్చు.

మీ భర్త ఈ తప్పులు చేస్తున్నాడా? అస్సలు సర్దుకు పోకండి..

అబ్బాయిలు కామన్ గా చెప్పే అబద్దాలు ఇవే

ప్రతి భర్త తన భార్యను ఇలా మాత్రం చూడాలనుకోడు

భార్యతో గొడవలకు ఈ మాటలే కారణం.. మాట్లాడే ముందు జాగ్రత్త