Telugu

చికెన్‌లో ఈ పార్ట్ తింటున్నారా.? ప్రమాదంలో పడుతున్నట్లే

Telugu

రకరకాల పేర్లతో

చికెన్‌ 65, చికెన్‌ మంచురియా, చికెన్ లాలిపప్‌ ఇలా చెప్పుకుంటూ పోతే చికెన్‌తో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. చాలా మంది ఫెవరేట్ ఫుడ్‌లో కూడా చికెన్‌ మొదటి స్థానంలో ఉంటుంది. 
 

Image credits: pexels
Telugu

పుష్కలమైన విటమిన్లు

చికెన్‌లో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని త్వరగా అందిస్తాయి. ఇందులోని బీ6, బీ12 విటమిన్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 
 

Image credits: Getty
Telugu

జీవక్రియకు

చికెన్‌ను మితంగా తీసుకుంటే జీవక్రియను మెరుగుపరచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని ఐరన్‌, జింక్‌ ఇందుకు దోహదం చేస్తాయి. 
 

Image credits: Pexels
Telugu

ఈ పార్ట్‌ మాత్రం

అయితే కొందరు చికెన్‌ను స్కిన్‌తో తినడానికి ఇష్టపడుతుంటారు. ఇది ఆరోగ్యానికి అంతలా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంట్లో పోషకల విలువలు ఏమి ఉండవని చెబుతున్నారు. 

Image credits: Freepik
Telugu

కెమికల్స్‌

కొంత మంది దుకాణదారులు కోళ్లు ఆకర్షణీయంగా కనిపించే ఉద్దేశంతో కోడి తోలుపై రసాయనాలు చల్లుతారు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని పడేలా చేస్తుంది. 

Image credits: Freepik
Telugu

స్కిన్‌ తింటే

కోడి చర్మంలో హానికరమైన కొవ్వులు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అనవసరమైన కొవ్వు పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

గుండె జబ్బులు

దీర్ఘకాలం కోడి స్కిన్‌ను తింటే రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. స్కిన్‌తో వండిన చికెన్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. 
 

Image credits: social media
Telugu

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

పెండ్లి చేసుకోకుండా కలిసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా

ఇక్కడ అబద్ధం మాత్రమే చెప్పాలి: ప్రేమానంద్ మహారాజ్

అన్నం ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా

ఏపీలో ఈ ప్రదేశాలను ఒక్కసారైనా సందర్శించాల్సిందే..