Lifestyle
ఆపిల్ పండులో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండును తింటే మీ ఆకలి తగ్గి ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.
జామకాయ కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనిలో పెక్టిన్, ఫైబర్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీరు తొందరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.
బెర్రీల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు ఈ పండ్లను రోజూ తిన్నా బరువు తగ్గుతారు.
వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉన్న పుచ్చకాయను తిన్నా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండు మీ ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది.
కమలాపండులో కేలరీలు తక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండును తింటే ఆకలి తగ్గి బరువు కంట్రోల్ లో ఉంటుంది.
ఫైబర్ పుష్కలంగా ఉన్న కివీ పండు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది. తొందరగా బరువు కూడా తగ్గుతారు.
ఈ పీచెస్ లో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఈ పండును తింటే మీరు తొందరగా బరువు తగ్గుతారు.