దీపావళికి ఇంట్లో చేసిన లక్ష్మీ- గణేశుని విగ్రహాలు, దీపాలు, కొవ్వత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మీ క్రియేవిటీ మొత్తం వాడి, డిఫరెంట్ గా చేసి ఆన్ లైన్ లో ఎక్కువ సంపాదించుకోవచ్చు.
ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో క్రియేటివ్ గ్రీటింగ్స్ పంపుతున్నారు. కాన్వా లేదా ఫోటోషాప్ వాడి స్పెషల్ దీపావళి డిజిటల్ కార్డ్‌లు డిజైన్ చేసి ఫైవర్ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మొచ్చు.
మీరు వంట చేయడంలో నిపుణులైతే, ఇంట్లో స్వీట్లు లేదా స్పెషల్ స్నాక్స్ చేసి అమ్మొచ్చు. వీటిని స్థానిక కమ్యూనిటీలో డెలివరీ చేయండి. దీపావళి టైంలో ప్రతి ఇంట్లో స్వీట్లకు డిమాండ్ ఉంటుంది.
మీరు ఒక్క రోజులో ఇంట్లో చేసిన స్నాక్స్, చాక్లెట్ ప్యాక్స్ వంటి కిట్స్ తయారు చేయొచ్చు. దీపావళికి గిఫ్ట్‌లు లేదా స్వీట్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని అమ్మినా ఈజీగా సంపాదించొచ్చు
ప్రతి ఇల్లు దీపావళికి అలంకరణ కోరుకుంటుంది. కానీ చాలా మందికి DIY చేయడం రాదు లేదా సమయం ఉండదు. మీకు ఈ టాలెంట్ ఉంటే, మంచి పార్ట్ టైమ్ జాబ్ లాగా మీ టాలెంట్ ని వాడుకోవచ్చు.
చాలా మంది బహుమతులు కొంటారు, కానీ ప్యాకింగ్ చేయడానికి టైం ఉండదు. మీరు చిన్న చిన్న ప్యాకేజింగ్ కిట్లు తయారు చేసి కస్టమర్లకు ఇవ్వొచ్చు. దీనితో కూడా సంపాదించొచ్చు.
మీ దగ్గర బైక్-స్కూటర్ ఉంటే, లోకల్ డెలివరీ లేదా ఫుడ్ డెలివరీ యాప్స్‌తో పార్ట్ టైమ్ పని చేయొచ్చు. దీపావళిలో ఆర్డర్లు పెరిగిపోతాయి, 1-2 రోజుల్లో మంచి అదనపు డబ్బు సంపాదించొచ్చు.
ఇన్‌స్టాగ్రామ్-ఫేస్‌బుక్ అకౌంట్ బాగుంటే, లోకల్ బిజినెస్‌ల కోసం ప్రమోషన్ చేయండి. చాలా దుకాణాలు, ఆన్‌లైన్ స్టోర్లు షార్ట్-టర్మ్ ప్రమోషన్ కోరుకుంటాయి. అది మీరు చేసి, సంపాదించొచ్చు.
దీపావళికి చిన్న దుకాణదారులకు బ్యానర్లు, పోస్టర్లు, ఆన్‌లైన్ ప్రమోషన్‌లో సహాయం అవసరం. మీరు 2-3 రోజులు పార్ట్-టైమ్ హెల్పర్‌గా ఉండి రూ.1000-2000 సంపాదించొచ్చు.
ఇంట్లో ఉన్న పాత బట్టలు, ఎలక్ట్రానిక్స్ లేదా అలంకరణ వస్తువులను OLX, Quikr, ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో అమ్మి అదనంగా సంపాదించొచ్చు. తక్కువ ధర వస్తువులపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది.
ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా సంపాదన లేదా పెట్టుబడి మార్గాన్ని అనుసరించే ముందు షరతులు, రిస్క్‌లను గమనించండి.