Lifestyle
థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే పేగుల కదలికల్లో వేగం తగ్గుతుంది. దీని కారణంగా మలబద్ధకం సమస్య వేధిస్తుంది. ఈ లక్షణం కనిపిస్తే థైరాయిడ్ కావొచ్చు.
హైపోథైరాయిడిజమ్ వల్ల శరీరంలో రక్త పరిమాణం తగ్గుతుంది. దీంతో గుండె వేగం నెమ్మదిస్తుంది. గుండెలో నొప్పి వంటి సమస్యలకు థైరాయిడ్ లోపం కూడా సంకేతం కావొచ్చు.
హైపోథైరాయిడిజమ్ కారణంగా జీవక్రియ వేగం తగ్గుతుంది. దీంతో శరీరంలో నీరు ఎక్కువ అవుతుంది. ఇది కీళ్లు, కండరాల నొప్పికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
థైరాయిడ్ పనితీరు దెబ్బ తిన్న వారిలో కుంగుబాటు లక్షణం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఒత్తిడి, హైపర్ టెన్షన్ వంటి లక్షణాలు థైరాయిడ్ లోపానికి సంకేతంగా భావించాలి.
హైపోథైరాయిడిజమ్ లక్షణాలు ఉన్న వారిలో జ్ఞాపకశక్తి తగ్గటం, ఏకాగ్రత కుదరకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది.
థైరాయిడ్ పనితీరు సరిగా లేకపోతే తరచూ అలసటగా ఉంటుంది. ఏ పనిచేయకపోయినా త్వరగా అలసిపోతుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి.
హైపోథైరాయిడిజం కారణంగా వాతావరణంతో సంబంధం లేకుండా చలి ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత కంట్రోల్‌లో లేకపోవడం ఈ సమస్య వస్తుంది. థైరాయిడ్ లోపమే దీనికి కారణంగా చెప్పొచ్చు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.