చాణక్య నీతి: ఎవ్వరైనా సరే ఈ విషయాల్లో మాత్రం తొందర పడొద్దు
చాణక్య నీతి
చాణక్య నీతి ప్రకారం..నాలుగు విషయాల్లో తొందరపడకూడదు. ఈ విషయాల్లో ఎంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది. లేదంటే మీరు తర్వాత బాధపడాల్సి వస్తుంది.
వ్యాపార నిర్ణయాలు
చాణక్య నీతి ప్రకారం.. వ్యాపారం విషయాల్లో ఎప్పుడూ కూడా తొందర పడి నిర్ణయాలు తీసుకోకూడదు. లేదంటే మీరు ఎంతో నష్టపోవాల్సి వస్తుందని ఆచార్య చాణక్యుడు అంటాడు.
సంబంధాల విషయంలో
కొంతమంది చాలా తొందరగా భావోద్వేగానికి లోనవుతారు. ఇలాంటి వారే ఏమీ తెలుసుకోకుండా తొందరగా సంబంధాలను ఏర్పరుచుకుంటారు. ఆ తర్వత తప్పుడు నిర్ణయం తీసుకున్నామని బాధపడతారు.
డబ్బు లావాదేవీల్లో
చాణక్య నీతి ప్రకారం.. డబ్బుల విషయంలో ఎప్పుడూ తొందరపాటు పనికిరాదు. మాటల మీద కాకుండా.. రాతపూర్వకంగా డబ్బు లావాదేవీలు జరపాలి. డబ్బు విషయంలో మీరు తొందరపాటు చేయడం మంచిదికాదు.
కొత్త పని మొదలుపెట్టేటప్పుడు
ఎవ్వరైనా సరే ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి.ఒకటికి రెండు సార్లు దాని మంచి చెడుల గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవాలి.