బేబీ వాకర్లు అంత మంచివేం కావు. ఎందుకంటే ఇవి మీ పిల్లలు సహజంగా నడక నేర్చుకోకుండా చేస్తాయి. వీటి వాడకం వల్ల కీళ్ల, కండరాల సహజ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కిందపడతారనే పడే ప్రమాదం
వాకర్ల మీద పిల్లలు నడక సరిగ్గా నేర్చుకోలేరు. అయితే చాలా మంది వాకర్ లేకపోతే కిందపడిపోతారని భయపడి వీటిని వాడతారు.
బొటనవేలుపై ఒత్తిడి
పిల్లల ఎత్తుకు, వాకర్ ఎత్తుకు చాలా తేడా ఉంటుంది. దీనివల్ల పిల్లలు బొటనవేలిపై నడుస్తారు. దీనివల్ల పిల్లలు సరిగ్గా నడవరు. ఇతరులకు, ఈ పిల్లల నడకకు చాలా తేడా ఉంటుంది.
కీళ్లు, ఎముకలపై ఒత్తిడి
వాకర్ ను ఉపయోగించడం వల్ల పిల్లల బొటనవేళ్లపై ఒత్తిడి పడుతుంది. దీంతో ఇది కీళ్లు, ఎముకలు అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.
కండరాల బలహీనత
వాకర్ ను వాడటం వల్ల పిల్లల కాళ్ల కండరాలు, తొడల బలం సరిగ్గా పెరగవు. అలాగే శరీర సమతుల్యత కూడా సరిగ్గా ఉండదంటున్నారు నిపుణులు. కండరాల బలం తగ్గుతుంది.
భయపడతారు
వాకర్ ను వాడే పిల్లలు దానిపైనే ఆధారపడి నడక నేర్చుకుంటారు. ఇలాంటి పిల్లల వాకర్ లేకుండా నడవడానికి భయపడతారు. సొంతంగా నడక నేర్చుకోలేరు.